గల్ఫ్ దేశాల్లో కర్నూలు సోనా బియ్యానికి డిమాండ్ అధికం. కర్నూలు సోనా బియ్యం గల్ఫ్ దేశాలతో పాటు యురోపియన్ కంట్రీస్‌కు కూడా ఎగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా బియ్యం ఎగుమతులు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు సోనా ప్రధాన ఆహార పంట. విదేశాలకు ఎగుమతులు ఉండటం వల్ల కర్నూలు సోనా బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్లో మార్పులు లేకపోయినప్పటికీ యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.


