బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర ప్ప తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం గాజులపల్లెకు చెందిన బోయ శ్రీకాంత్ (37), ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మౌనికకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి శ్రీకాంత్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నా నయం కాలేదు.గురువారం రాత్రి నొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుర్తించి, ఉరిని తప్పించి వెంటనే శ్రీకాంత్‌ను బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న
కర్ణాటక బస్సు
● వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు – కర్నూలు రహదారిలో కరివేన గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన బాలీశ్వరయ్య అనే వ్యక్తి బైక్‌పై కరివేనకు వస్తూ సర్వీస్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్తుండగా శ్రీశైలం నుంచి రాయచూరు వెళ్తున్న కర్ణాటక బస్సు వేగంగా ఢీకొంది. బాలీశ్వరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పది మంది భక్తులకు గాయాలు
శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని దేవస్థానం టోల్‌గేట్ వద్ద శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో కన్నడికులకు చెందిన బొలెరో వాహ నం అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. వన్‌టౌన్ ఎస్‌ఐ సుబ్బారెడ్డి, దేవస్థానం సీఎస్‌ఓ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. శుక్రవారం ఉద యం కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా పొట్లగిరి గ్రామానికి చెందిన కర్ణాటక వాసులు బొలెరో వాహనంలో దేవస్థానం టోల్‌గేట్ చేరుకున్నారు. వాహన డ్రైవర్ వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవస్థానం వైద్యశాలకు 108లో తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్బారెడ్డి తెలిపారు.
కోళ్లకు విషం
డోన్ రూరల్: మండల పరిధిలో కొచ్చెర్వు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందికి రైతు రామకృష్ణ తన పొలంలో కోళ్లను పోషిస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఆహారంలో విషం కలిపి వాటికి పెట్టడంతో 24 కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.


