శ్రీగిరిలో కన్నడ భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో కన్నడ భక్తుల సందడి

Mar 14 2026 7:34 AM | Updated on Mar 14 2026 7:34 AM

● ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు ● భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం ● 15వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనం

● ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు ● భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం ● 15వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహా క్షేత్రంలో కన్నడ భక్తుల సందడి నెలకొంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ముందుగానే అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుంటున్నారు. కన్నడ భక్తులు శ్రీశైల భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామి వారిని తమ అల్లుడిగా భావిస్తారు. తమ ఇంటి ఆడపడుచు అయిన భ్రమరాంబా దేవిని కను లారా దర్శించి, చీర, సారే సమర్పించేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో తరలి వస్తు న్న భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. తమ ఇంటి ఆడపడుచు ఆశీస్సుల కోసం కన్నడ భక్తులు పరితపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం పాదయాత్ర చేస్తూ తమ ఆడపడుచు చెంతకు చేరుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబ దేవి కోసం ఇంటి నుంచే చీర, సారెను తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. దర్శ నం అనంతరం శ్రీశైలం నుంచి ఆడపడుచుల కోసం పలు వస్తువులు సైతం కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారు.

స్పర్శ దర్శనం కోసం తరలివస్తూ..

కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించా రు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో పది రోజులపా టు కనడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశా రు. దీంతో మల్లన్న స్పర్శ దర్శనం కోసం ఉత్సవాల కంటే ముందుగానే భారీగా కనడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మల్లన్న స్పర్శ దర్శనం చేసుకుని, తమ జన్మ ధన్యమైందని కన్నడ భక్తులు పరితపిస్తున్నా రు. దేవస్థానం కల్పించిన మల్లన్న స్పర్శ దర్శనంపై కన్నడ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని పాదయాత్రగా వేలాది మంది కన్నడ భక్తులు తరలివస్తున్నారు. వెంకటాపురం నుంచి నల్లమల అడవు ల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. వృద్ధులు, చంటిపిల్లలు, మహిళలు సైతం ఎండను కూడా లెక్క చేయకుండా అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. పలువురు భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని నడుచుకుంటూ వస్త్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా గే శివ స్వరూపంగా భావించే పల్లకీని మోసుకుంటూ పాదయాత్రగా వస్తున్నారు. కొందరు యువకులు డప్పు వాయిద్యాలతో చిందులు వేసుకుంటూ భక్తి, శ్రద్ధలతో తరలివస్తున్నారు. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఉచిత, రూ.500, రూ.200 టికెట్ల ప్రవేశ ద్వారాల నుంచి మల్లన్న దర్శనానికి బారులుదీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు రద్దీగా మారాయి. భక్తుల శివనామస్మరణ మారుమోగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement