ఎమ్మిగనూరురూరల్: గువ్వలదొడ్డి గ్రామంలో ఎలక్ట్రీషి యన్ దుర్గాప్రసాద్ (28) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. గ్రామా నికి చెందిన మునిస్వామి, పద్మావతిల కుమారుడు దుర్గాప్రసాద్(28) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఆరేళ్ల క్రితం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన బేగంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గౌతంనంద్ (2) అనే బాలుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో ఐదు నెలలుగా బేగం పుట్టినిల్లు రాళ్లదొడ్డికి వెళ్లిపోయింది. భార్య పుట్టినింటికి వెళ్లినప్పటి నుంచి దుర్గాప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12వ తేదీ ఇంట్లో గదిలో గడియ వేసుకుని నిద్రించి శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. త లుపులు బద్దలకొట్టి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


