● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): పవిత్ర రంజాన్ నెల మానవాళికి శాంతి, సహనం, సోదరభావాన్ని బోధిస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని 2వ వార్డు బడి మార్కెట్ సమీపంలో ఉన్న మస్జీద్–ఎ– జులేఖానీ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత పెంపొందాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రెండో వార్డు నాయకులు సిరాజ్, శంకర్, ఫిరోజ్, అఫ్రోజ్, వలీ, ఇలియాజ్, స్థానిక ముస్లిం నాయకులు, యువకులు పాల్గొన్నారు.


