రగ్బీ చాంపియన్స్ నెల్లూరు, గుంటూరు
● ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ సబ్ జూనియర్ క్రీడా పోటీలు
కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 11 వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశా యి.ఈ పోటీల్లో విజేతగా నెల్లూరు (బాలురు), గుంటూరు (బాలికలు )జట్లు నిలిచాయి. అలాగే కర్నూలు బాలుర జట్టుకు రజతం, బాలికలకు కాంస్యం దక్కాయి. బాలుర విభాగంలో కర్నూలు రెండో స్థానం, పల్నాడు మూడవ స్థానం, బాలికల విభాగంలో సత్యసాయి జిల్లా రెండో స్థానం, కర్నూలు మూడవ స్థానం దక్కించుకున్నాయి. విజేతలుగా నిలిచిన జట్లకు ఆదర్శ విద్యామందిర్ డైరెక్టర్ డాక్టర్ హరికిషన్, రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు కలిసి కప్పులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సుంకన్న, వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
రగ్బీ చాంపియన్స్ నెల్లూరు, గుంటూరు


