తల్లి, కూతురు మృతదేహాలు లభ్యం
గడివేముల: శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న వారిలో మంగళవారం ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. గడివేముల మండలం ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లె ఎల్లాలక్ష్మి (23),వైష్ణవి(3), సంగీత (మూడునెలల చిన్నారి) ఆదివారం మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్‌ఆర్‌బీసీలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురు మృతదేహాల కోసం మంగళవారం ఉదయం సహాయక బృందాలు గాలింపు చేస్తుండగా తల్లి ఎల్లాలక్ష్మి, పెద్ద కూతూరు వైష్ణవి మృతదేహాలు కనిపించాయి. బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు పంపించారు. ఎల్లా లక్ష్మి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు భర్త రమణయ్యతో పాటు అత్త నాగలక్ష్మి, ఆడపడుచు భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చిన్నారి సంగీత ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఎల్లాలక్ష్మి (ఫైల్) వైష్ణవి (ఫైల్)
తల్లి, కూతురు మృతదేహాలు లభ్యం


