పుడమి తల్లి ‘ఉల్లి’కిపాటు
ట్రాక్టర్‌తో ఉల్లి పంటను దున్నుతున్న రైతు
రైతు కష్టం నేలపాలు కావడంతో పుడమి తల్లి ఉలికిపాటుకు గురైంది. నాట్లు వేసి.. ఎరువు చల్లి.. నీరు కట్టిన చేతులతోనే పచ్చని పంటను దున్నేస్తుంటే మౌనంగా రోదించింది. నల్లటి నేలలో కలసిపోతున్న ఎర్రటి ఉల్లిని చూసి తల్లడిల్లింది. వరుసగా తన బిడ్డ నష్టాలు మూటగట్టుకుంటుంటే చలించిపోయింది. పెట్టుబడిని కోల్పోయి అప్పుల్లో దిగబడుతున్న రైతు ను ఆదుకునేదెవరంటూ ప్రశ్నించింది. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెంది న రైతు పీవై. సురేంద్ర ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన తరు ణంలో మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కనీసం కూలీల ఖర్చు కూడా చేతికందే పరిస్థితులు లేకపోవడంతో బుధవారం పంటను తొలగించాడు. ట్రాక్టర్‌తో టిల్లర్ కొట్టించి దున్నేశాడు. చూసినా వారంతా అయ్యో అంటూ నిట్టూర్చారు.
– పాణ్యం
పుడమి తల్లి ‘ఉల్లి’కిపాటు


