5న అప్రెంటిషిప్‌కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
కర్నూలు సిటీ: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిషిప్‌కు దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థులకు వచ్చే నెల 5న సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.నజీర్ అహ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 25 నుంచి ఈ నెల 8వ తేది వరకు అప్రెంటిషిప్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించామన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఐటీఐ అభ్యర్థులకు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలోని జోనల్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామన్నారు. డిజిల్ మెకానిక్ ట్రేడ్ అభ్యర్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మోటర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్(సివిల్) ట్రేడ్‌లకు చెందిన అభ్యర్థులు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే వెరిఫికేషన్‌కు హాజరుకావాలన్నారు. వివరాలకు 08518–257025 నెంబరును సంప్రదించాలని పేర్కొన్నారు.
నలుగురికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి
కర్నూలు (సిటీ): పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నలుగురికి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండీ హనీఫ్ కె.నాగలాపురం పోలీస్‌స్టేషన్ నుంచి పదోన్నతి పొంది వెల్దుర్తికి బదిలీ అయ్యారు. జూపాడుబంగ్లా పీఎస్‌లో పనిచేస్తున్న సి.నాగన్న, ఆస్పరి పీఎస్ నుంచి బి.మద్దిలేటి, కోవెలకుంట్ల పీఎస్ నుంచి డి.మీరా సాహెబ్ పదోన్నతి పొందారు. వీరిని నంద్యాల జిల్లాకు కేటాయించారు.
సమగ్ర శిక్ష ఏపీసీగా లోకరాజు
కర్నూలు(సిటీ): సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్(ఏపీసీ)గా డాక్టర్ ఎన్.బి.లోకరాజును నియమిస్తూ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ పోస్టు ఏడు నెలలుగా ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు డీఈఓ అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం జీవీఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్‌బీ లోకరాజును ఫారిన్ సర్వీస్ కింద డిప్యూటేషన్‌పై నియమించారు. డిగ్రీ కాలేజీ కమిషనర్ నుంచి రిలీవింగ్ ఆర్డర్ వచ్చిన వెంటనే కర్నూలు ఏపీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ప్రజోపయోగకరమైన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం జిల్లా పంచాయతీ అధికారి జీ.భాస్కర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో విద్యుత్ మోటార్ల రిపేర్లు, తాగునీటి పైల్‌లైన్ల మరమ్మతులు, సీసీ రోడ్లు, గుంతలు పడిన రోడ్లకు గ్రావెల్ వేయడం తదితర పనులను సర్పంచులు చేయించారన్నారు. అధికారులు సీనియారిటీ ప్రకారం గాకుండా టీడీపీ నేతలు కొత్తగా చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. సర్పంచుల పదవీ కాలం త్వరలో ముగుస్తున్నందున అప్పులు చేసి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. డీపీఓ భాస్కర్ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ నిధులతో 31 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలను నిర్మిస్తున్నట్లుగా జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతులు కూడా లభించాయన్నారు. తుగ్గలి, పత్తికొండ మండలాల్లో మరో ఐదు పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రతిపాదన ఉందన్నారు. ఒక్కో భవనానికి రూ.32 లక్షలు ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రూ.7.75 కోట్లు,ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.2.17 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.
5న అప్రెంటిషిప్‌కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్


