శ్రీ మఠంలో జిల్లా ఎస్పీ
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్ర స్వామిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దర్శించుకున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మలకు అర్చన హారతులు చేపట్టారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందవానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని శ్రీమఠం అధికారులకు సూచించారు. శ్రీ మఠంలో నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ రోజుల్లో మరో ఐదుగురు పోలీసులు, హోంగార్డులను వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ భార్గవి, సిఐ రామాంజులు, శ్రీమఠం అధికారులు ఉన్నారు.


