ప్రజలపై మోయలేని విద్యుత్ భారం
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సర్కారు ప్రజలపై మోయలేని విధంగా విద్యుత్ భారం వేస్తోందని సీపీఎం జిల్లాకార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ అన్నా రు. సోమవారం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకమునుపు ట్రూ అప్‌చార్జీలను వ్యతిరేకించారని, గత ప్రభు త్వంపై భారాలు మోపుతోందని విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు రూ.24 వేల కోట్ల ట్రూ అప్‌చార్జీలు, సర్‌చార్జీల పేరిట ప్రజలపై భారం మోపారని, అది చాలక మరోసారి రూ.12 వేల కోట్ల భారాలను వేసేందుకు పూనుకోవడం అన్యాయమన్నా రు. ఇప్పటికే కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసమయంలో మరోసారి ప్రజలపై భారం వేసేందుకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంగళవారం ఏపీఈఆర్‌సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నా యకులు టి.రాముడు, అరుణ, వై.నగేష్, విజయ రామాంజనేయులు, సీహెచ్‌సాయిబాబ, సుధాక రప్ప, ఎస్‌ఎండీ షరీఫ్ పాల్గొన్నారు.


