మెదడులో కలకలం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ రోగులకు చికిత్స అందిస్తారు. ప్రతి ఓపీ రోజున 200 నుంచి 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఇందులో వీరిలో 20 శాతం మంది మూర్చ వ్యాధి బాధితులుంటున్నారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ఐపీ సేవలతో పాటు ఈఈజీ, ఎపిలెప్సీ స్టడీ సేవలు ఏడాదికి 3వేల మంది వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఇవే పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటే రూ.2 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. మూర్ఛ బాధితులకు అవసరమైతే ఎంఆర్‌ఐ, వీడియో ఈఈజీ పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలోనే గాక జిల్లా మొత్తంగా సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్దకు వెళ్లే వారు ప్రతి నెలా మరో 10వేల మంది దాకా ఉంటారని అంచనా. కాగా ఇప్పటికీ గ్రామాల్లో కొందరు ఈ వ్యాధికి నాటు మందు తీసుకుంటున్నారు. ప్రాణాల మీదకు వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వస్తున్నారు.
మూర్చలో రకాలు–లక్షణాలు
● సాధారణ మూర్ఛలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్చలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు.
● మయోక్లోనిక్ మూర్చలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలలో ఆకస్మిక విచ్ఛిన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లల్లో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు.
● ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు.రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతులలో, కాళ్లల్లో తరచూ లాగుతుంది.
చికిత్స
మూర్ఛ వ్యాధులను 75 శాతం మందులతోనే నయం చేయవచ్చు. 25 శాతం మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి వారికి కూడా ముందుగా మందులు ఇచ్చి చూస్తారు. అయినా మందులకు లొంగకపోతే ఆపరేషన్‌కు సూచిస్తారు. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్చ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. కాస్త బాగైందిలే అని మందులు మానిస్తే ప్రమాదం సంభవించవచ్చు.
మూర్ఛవ్యాధి అంటే...
మూర్ఛ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటి అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికై నా రావచ్చు.
పెరుగుతున్న మూర్ఛ వ్యాధి బాధితులు
అవగాహనే ఈ జబ్బుకు నివారణ
కొద్దికాలం మందులు వాడితే నయం
చికిత్సలో ఆధునిక మందులు,
పరికరాలు
నేడు జాతీయ మూర్ఛ వ్యాధి
అవగాహన దినం
ఉన్నట్లుండి కింద పడిపోయి కాళ్లూ, చేతులు కొట్టుకుంటూ నోట్లో నురగ వస్తుంటే అలాంటి వారిని చూసి మూర్చ వచ్చిందని భావిస్తాము. వెంటనే కొందరు వారి నుదుటన అదిమి పట్టి, చేతుల్లో తాళం చెవి పెట్టి అలాగే ఉంచుతారు. కొద్దిసేపటికే ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా మారి మళ్లీ ఎలా వచ్చాడో అలా వెళ్లిపోతారు. సమాజంలో నిత్యం ఇలాంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాము. దీనినే వైద్యపరిభాషలో ఎపిలెప్సీ అని, సాధారణ పరిభాషలో మూర్ఛ/వాయి/ఫిట్స్ అని పిలుస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అవగాహన కలిగి ఉండటంతో పాటు సకాలంలో మందులు వాడితే ఈ జబ్బు నుంచి బయటపడొచ్చు. నేడు జాతీయ మూర్చవ్యాధి అవగాహన దినం సందర్భంగా
ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్)
కారణాలు
వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్చ వస్తుంది.
మెదడులో కలకలం!


