జనవరి 1న ‘కొత్త’ శోభ | - | Sakshi
Sakshi News home page

జనవరి 1న ‘కొత్త’ శోభ

Dec 25 2023 2:00 AM | Updated on Dec 25 2023 9:46 AM

- - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద మరోసారి కొత్త పింఛన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. వేలాది మంది అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, వివిధ వర్గాల వారి జీవితాలకు భరోసానిస్తూ కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవరత్నాల్లో భాగంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని వైఎసార్‌సీపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

ఇందుకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండటం విశేషం. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను జనవరి 1న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి పాత వాటితో పాటు కొత్త పింఛన్ల పంపిణీ మొదలు కానుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం రూ.2,750 ఉన్న పెన్షన్‌ కానుకను జనవరి 1 నుంచి రూ.3వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పింఛన్లను కూడ ఇదే మొత్తాన్ని అందించనుండటంతో అవ్వతాతలు, ఇతర అన్ని వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఏడాదిలో 38,592 కొత్త పింఛన్లు
2023 సంవత్సరం జనవరి, సెప్టెంబర్‌ నెలల్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జనవరిలో కర్నూలు జిల్లాకు 8,446, నంద్యాల జిల్లాకు 6,843 చొప్పున ఉమ్మడి జిల్లాకు 15,289 కొత్త పింఛన్లు వచ్చాయి. సెప్టెంబర్‌ నెలలో రెండు విడతలుగా కర్నూలు జిల్లాకు 12,341, నంద్యాల జిల్లాకు 10,962 చొప్పున ఉమ్మడి జిల్లాకు 23,303 పింఛన్లు మంజూరయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో 2018 డిసెంబర్‌ నెలలో ఉమ్మడి జిల్లాలో 3,61,563 పింఛన్లు ఉండగా వీటికి పంపిణీ చేసిన నగదు రూ.40.27 కోట్లు మాత్రమే. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2023 సెపెంబర్‌ నెలలో పింఛన్ల సంఖ్య 4,71,561కి చేరుకుంది. టీడీపీ హయాంతో పోలిస్తే 1,09,998 పింఛన్లు పెరిగాయి. ప్రస్తుతం పింఛన్ల రూ.130.76 కోట్లు పంపిణీ చేస్తున్నారు.

రాజకీయాలకు అతీతం
టీడీపీ పాలనలో పింఛను పొందాలంటే ఓ ప్రహసనమనే చెప్పాలి. ప్రత్యేకంగా కొత్త పింఛన్ల ఊసే ఉండేది కాదు. పింఛను పొందుతున్న వారిలో ఎవరైన మరణిస్తేనే కొత్త పింఛను మంజూరు చేసేవారు. అప్పుడు కూడా జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. అయితే వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో అర్హతే ప్రామాణికంగా, రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరవుతున్నాయి. ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండటం విశేషం.

ప్రత్యేక టీంలతో వెరిఫికేషన్‌ 
కొత్త పింఛన్ల డేటా వెరిఫికేషన్‌ కోసం డీఆర్‌డీఏ–వైకేపి సూచనల ప్రకారం గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూడు, అర్బన్‌ ప్రాంతాల్లో ఆరు టీంలు ఏర్పాటు చేశారు. వెరిఫికేషన్‌ కోసం ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేశారు. దరఖాస్తుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి డేటా నేరుగా ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్‌లకు చేరుతోంది. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు మంగళవారం నుంచి వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 25 వేలకుపైగా కొత్త పింఛన్ల డేటా వెరిఫికేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. 

వెరిఫికేషన్‌లో ఏమి చేస్తారంటే.. 
► కొత్త పింఛన్ల కోసం కొన్ని నెలల క్రితం

  దరఖాస్తులు అప్‌లోడ్‌ అయ్యాయి.  
► అందువల్ల వెరిఫికేషన్‌లో దరఖాస్తుదారు బతికే ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. 
►గ్రామం/పట్టణంలో నివాసం ఉంటున్నారా... లేదా? పింఛను పొందడానికి అర్హతను తెలుసుకుంటారు.  
►  వికలాంగులు అయితే సదరం సరి్టఫికెట్‌ తప్పనిసరి. 
► ఇతర పింఛన్లకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement