
పామును పట్టుకున్న మోహన్
మహానంది: రోజూ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పాముల సంచారం అధికమైంది. మండలంలోని శ్రీనగరం గ్రామంలో మంగళవారం నవీన్ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించడంతో అతను వచ్చి పామును పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు.