
సాక్షి, డోన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు. డోన్‌లోని దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్‌లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న నాయకులను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలుకరించారు.

ఇక, వైఎస్ జగన్ రాకతో డోన్ పట్టణం జనసంద్రమైంది. తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.