గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

లంకపల్లి వద్ద నదీగర్భంలో పట్టాలు ఉన్న భూమి కంటే ఎక్కువ ఉన్నట్లు రికార్డులు ఇసుక ఉన్నచోట టీడీపీ వారికి పట్టాల జారీ రూ.వందల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం

1952లోనే భూముల కొనుగోలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: లంకపల్లి లంక భూముల విషయంలో భారీ స్కామ్‌కు అధికారపార్టీ తెరలేపింది. రెవెన్యూ అధికారుల సహకారంతో రీసర్వే పేరుతో 350 ఎకరాలను అసలు భూములే లేనివారికి అదనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా వచ్చే మూడేళ్లలో మూడు వందల కోట్ల రూపాయల మేర దండుకునేందుకు రంగం సిద్ధం చేసింది. లంకపల్లి లంకలో 250 ఎకరాలకు పాస్‌పుస్తకాలు ఉండగా, రికార్డుల్లో లేని వాళ్ల పేర్లతో వీలునామా సృష్టించిన అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు తీసుకున్నారని సమాచారం. మరోవైపు పేదలకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చూపిస్తూ, ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చేశారు. సాగుభూమి కంటే ఎక్కువ భూములు ఉన్నట్లు చూపించి భారీగా కొల్లగొట్టారు. గతంలో ఉన్న వీలునామా ఆధారంగా ఈ భూములు కేటాయించినట్లు తహసీల్దార్‌ చెబుతున్నారు.

కోర్టు వివాదాలను విస్మరించి..

పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం లంకపల్లి లంకలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడి సుమారు 600 ఎకరాలకు అనధికారికంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేసేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూముల యాజమాన్యంపై వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌ హడావిడిగా తనకు అనుకూలంగా ఉండే వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేశారు. గతంలో ఈ రైతులు ఎప్పుడూ భూముల కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఈ భూముల కేటాయింపునకు ఆ రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లింకు దస్తావేజులు ఇతర అర్హత పత్రాలు కూడా పరిశీలించలేదు. వీఆర్‌ఓ గానీ ఆర్‌ఐ గానీ తమ రిమార్కులు పంపకుండానే తహసీల్దార్‌ పట్టాలు ఇచ్చేశారు.

రికార్డులు తారుమారు

భూ రీసర్వే సందర్భంగా సర్వే జరిపి వారి భూములు వారికి ఇచ్చినట్టు తహసీల్దారు చెబుతున్నారు. ఈ రీసర్వే పేరుతో తహసీల్దారు, సర్వేయర్లు కుమ్మకై ్క రికార్డులు తారుమారు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో వివిధ కారణాలతో నదీగర్భంలో కలిసి పోయిన భూములను ఏవి ధంగా సర్వేచేసి హద్దులు గుర్తించారన్న విషయం చెప్పడం లేదు. ఇదే గ్రామానికి చెందిన కోగంటి పూర్ణచంద్రరావుకు ఒక్క ఎకరం భూమి లేకపోయినా 30 ఎకరాలు కేటాయించేశారు. మన్నె కోటేశ్వరరావుకు 12.5 ఎకరాలు, మన్నె శ్రీనివాస రావుకు 25 ఎకరాలు కేటాయించగా, మానసిక పరిస్థితి సరిగాలేని కృష్ణచైతన్య పేరుతో ఏకంగా 16.77 ఎకరాలు కేటాయించారు. వీరిలో కొందరికి భూమి కేటాయించినట్లు కూడా తెలియదు. పది మందికి సుమారు పది నుంచి 30 ఎకరాల వరకూ పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేశారు. ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే బినామీగా ఉండే గంటా సురేష్‌తో కుమ్మకై ్క తహసీల్దార్‌ కేటాయించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

యలమర్రు ఎస్టేటు జమీందారుల నుంచి లంకపల్లి లంకలో అప్పటి సర్వే నంబర్లు 13,14లో 371.60 ఎకరాలను ఎకరాకు రూ.250 చొప్పున 1952లో కొనుగోలు చేశారు. రూ.8 వేల అగ్రిమెంటు మొత్తం చెల్లించి స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి అనుభవిస్తున్న ఎస్సీ భూములను కూడా ప్రభుత్వ భూములుగా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చారు. ఇదే భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. మైనింగ్‌ కోసం తహసీల్దారు టెండర్లు పిలిచిన భూమి 22ఏలో ఉంది. దీన్ని ప్రభుత్వ భూమిగా తేల్చి పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇసుక కాంట్రాక్టర్లకు కేటాయించి అక్రమాలకు తెరలేపారు. అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టం ప్రకారం ఈ భూములను వాణిజ్య అవసరాలకు వాడకూడదని ఉన్నప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కారు. సెక్షన్‌ 22–ఏ అసైన్డ్‌ భూములను కలెక్టరు అనుమతి లేకుండా డీనోటిఫైడ్‌ చేయకుండా ఇసుక మైనింగుకు ఇవ్వకూడదు. గ్రామ సభల తీర్మానం లేకుండా లంక భూములు, నదీగర్భంలో ఇసుక మైనింగ్‌కు అనుమతి లేదు. లంకపల్లిలో 150 మంది ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు పదేళ్ల నుంచి డీకేటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి ఆదాయం కోసం రెవెన్యూ అధికారులు అడ్డదారులు తొక్కడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే కై లే అనీల్‌కుమార్‌ నేతృత్వంలో ఉయ్యూరు ఆర్‌డీఓ, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పామర్రు నుంచి ఒక ప్రతినిధి బృందం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిసి ఫిర్యాదు చేసింది. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కై లే అనీల్‌కుమార్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement