దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.3.04 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.3.04 లక్షల విరాళం

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.3.04 లక్షల విరాళం దుర్గమ్మ సేవలో సినీనటుడు నాని రైతు బజారుల్లో రూ.35కే కిలో ఉల్లిపాయలు విద్యాశాఖాధికారి తనిఖీలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన భక్తులు బుధవారం రూ.3.04 లక్షల విరాళం సమర్పించారు. ఏలూరు శాంతినగర్‌కు చెందిన కాపర్ల శ్రీరామ్‌ కుటుంబం అమ్మ వారి దర్శనానికి విచ్చేసింది. శ్రవణ్‌, సాన్వి, స్వర్ణ పేరిట రూ.3.04 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఛైర్మన్‌ రాధా కృష్ణ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటుడు నాని బుధవారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన నానికి ఆలయ అధి కారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్యారడైజ్‌ సినిమా విజయవంతం కావడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరి పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నానికి వేద ఆశీర్వచనం, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. నానితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, ఆలయ సిబ్బంది పోటీ పడ్డారు.

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): మార్కెట్‌లో పెద్ద ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కిలో రూ.35కే రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలి పారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతుబజారులో ఉల్లి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలో ఉల్లిని రూ.70 చొప్పున విక్రయిస్తున్నారని, దీంతో పేద, మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా రైతుబజారుల్లో సబ్సిడీపై ఉల్లిని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ కె.కన్నబాబు, డైరెక్టర్‌ నుపుర్‌ అజయ్‌ శ్రీనివాసర్‌, డీఎం సతీష్‌ పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: స్థానిక రుస్తుంబాద్‌ బాయ్స్‌ మునిసిపల్‌ హై స్కూల్‌ను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు బుధవారం సందర్శించారు. విద్య, పరిపాలన అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, నోట్‌బుక్‌ల కరెక్షన్‌, ఉపాధ్యాయుల సిలబస్‌ స్థాయి, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు బియ్యం, గుడ్ల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు వినియోగిస్తున్న స్పోర్ట్స్‌ కిట్లు, అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యత పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకు న్నారు. మిషన్‌ మార్చి–2027లో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి బుక్స్‌ను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement