సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

● ఘంటసాల మండలం అచ్చెంపాలెంలో పంచాయతీలో చెరువుల వేలంపాట నిధులు, వీధి దీపాల కరెంటు బిల్లులు చెల్లింపు తదితర పనులకు సంబంధించిన సుమారు రూ. 40 లక్షల నిధులు పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేశారని అర్జీలో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఉయ్యూరు డీఎల్‌డీవోను విచారణ అధికారిగా నియమించాలని డీపీవో ధనలక్ష్మిని ఆదేశించారు. ● తాడంకిలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న 94, 95 పోలింగ్‌ కేంద్రాల్లో సుమారు 2,300 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పాఠశాల భవనం ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో కేంద్రాలను తాడంకి ఉన్నత పాఠశాలకు మార్చడానికి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్‌ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.

పీజీఆర్‌ఎస్‌ఎలో 192 అర్జీలు స్వీకరణ కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ నవీన్‌, డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌ అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు 192 అర్జీలను స్వీకరించారు.

అర్జీల్లో కొన్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement