25న పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

25న పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న జిల్లాలోని 18 ఏళ్లలోపు చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు మాట్లాడుతూ జిల్లాలోని 3,125 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 5,05,473 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25న మాత్రలు ఇవ్వని చిన్నారులకు అక్టోబరు 5న మ్యాప్‌ అండ్‌ డే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్‌ మాధవి, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందమతీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement