ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఆర్.వెంకట సన్యాసిరావు కుమారుడు విశ్వసాయి హవిష్ అమ్మవారి వివిధ పథకాలకు రూ.3.52 లక్షలు విరాళాలను అందజేశారు. అమ్మవారి అన్నదానానికి రూ.1.50 లక్షలు, మల్లేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి రూ.1.02 లక్షలు, అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని అందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవ్వాన శ్రీనివాసరావు, బుర్రా రాంబాయిల కుటుంబం సభ్యులు అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని, విజయవాడ కొత్తపేట కుమ్మరి వీధికి చెందిన రాంపిళ్ల పద్మజ, వెంకట రమణలు అమ్మవారి అన్నప్రసాదానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


