మార్కాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)లో 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా శనివారం రెండో రోజు లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హెచ్‌ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. బాలుర విభాగం లీగ్ దశలో శ్రీకాకుళం జట్టు గుంటూరు జట్టుపై, ఈస్ట్ గోదావరి జట్టు అనంతపురం జట్టుపై, కృష్ణా జట్టు కడప జట్టుపై విజయం సాధించినట్లు హెచ్‌ఎం తెలిపారు. విశాఖపట్నం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై, కర్నూలు జట్టు విజయనగరంపై, చిత్తూరు జట్టు తూర్పు గోదావరిపై, నెల్లూరు జట్టు కడప జట్టుపై గెలుపొందాయి. గుంటూరు జట్టు ప్రకాశంపై, అనంతపురం జట్టు కృష్ణాపై, శ్రీకాకుళం జట్టు కర్నూలుపై, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై, గుంటూరు జట్టు కృష్ణాపై, గుంటూరు జట్టు కర్నూలుపై, ఈస్ట్ గోదావరి జట్టు కృష్ణాపై, విశాఖపట్నం జట్టు విజయనగరంపై గెలుపొందాయి.
బాలికల విభాగంలో..
శ్రీకాకుళం జట్టు కడపపై, అనంతపురం జట్టు కృష్ణా పై, నెల్లూరు జట్టు పశ్చిమగోదావరిపై, ఈస్ట్ గోదావరి జట్టు కర్నూలుపై, గుంటూరు జట్టు చిత్తూరుపై, విశా ఖపట్నం జట్టు కృష్ణాపై, నెల్లూరు జట్టు విజయనగరంపై, ప్రకాశం జట్టు కడపపై, అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై, శ్రీకాకుళం జట్టు చిత్తూరుపై, గుంటూరు జట్టు కర్నూలు జట్టుపై, అనంతపురం విజయనగరంపై, చిత్తూరు జట్టు కడపపై, కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై, గుంటూరు జట్టు ఈస్ట్ గోదావరిపై విజయాన్ని సాధించాయి. ఈ చాంపియన్‌షిప్ పోటీ లు రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ జట్టు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు మురళి పర్యవేక్షణలో జరిగాయి. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.దామోదర్‌రెడ్డి తెలిపారు. పీవీ కృష్ణారావు, వై.శీనయ్య, శంకర్, చెంచయ్య నాయుడు, కోటేశ్వరరావు, జాహ్నవి ప్రియ, కె.ఓబులేసు, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, 13 జిల్లాల క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు


