ఇబ్రహీంపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన మూలపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. జూపూడికి చెందిన జిమ్‌ట్రైనర్ జంగా శ్రీనివాసరావు(31)కు రెండేళ్ల కిందట మూలపాడుకు చెందిన మహిళతో వివాహమైంది. కుటుంబంలో ఇటీవల చెలరేగిన కలహాలతో అతని భార్య మూలపాడులో పుట్టింటికి వెళ్లింది. శ్రీనివాసరావు కూడా మూలపాడులో అద్దె ఇళ్లు తీసుకుని భార్యతో కలిసి ఉంటున్నాడు. మరలా వివాదం నేపథ్యంలో భార్య తరుపు బంధువులతోమాటమాట పెరగడంతో మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తెల్లారిన తర్వాత గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచామిచ్చారు. మృతుడికి భార్య, పది నెలల కుమారుడు ఉన్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


