రోగులకు నాణ్యమైన సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

రోగులకు నాణ్యమైన సేవలు అందించండి

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

రోగులకు నాణ్యమైన సేవలు అందించండి లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆ ప్రాంతంలో జరుగుతున్న సంచార చికిత్సా కార్యక్రమం, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అందుతున్న సేవలు, రికార్డులు, సిబ్బంది హాజరు, స్టాక్‌ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలని పరిశీలించి పలు సూచనలు చేశారు. టీకా కేంద్రంలో అనాఫిలాక్సిస్‌ కిట్‌ లభ్యతపై సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్‌ నవీన్‌, కంచకచర్ల వైద్యాధికారి డాక్టర్‌ అక్తర్‌ బేగం, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. తిరువూరు సబ్‌ రిజిస్ట్రారుపై వేటు తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం తోటమూలలో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో ఈ నెల 17న సాక్షిలో వచ్చిన కథనానికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ స్పందించింది. జీవో నెం.30 ని సాకుగా చూపి దొడ్డిదారిన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంలో తిరువూరు సబ్‌ రిజి స్ట్రారు చాముండేశ్వరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను విజయవాడకు డెప్యుటేషన్‌పై పంపారు. ఆమె స్థానంలో విజయవాడ నుంచి ఎస్‌ఎన్‌వీ సత్యనారాయణను డిప్యుటేషన్‌పై నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం పురస్కారాలకు దరఖాస్తుల గడువు 26 వరకు పొడిగింపు ఉచిత శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోండి

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2026–27 విద్యాసంవత్సం డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల అయిందని అధ్యయన కేంద్రం డెప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, బీఎల్‌ఐఎస్‌సీ కోర్సులలో ప్రవేశాలకు యూనివర్శిటీ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిప్లమో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ఏబీసీడీ ఐడీ, డీఇబీ ఐడీను క్రియేట్‌ చేసుకుని అడ్మిషన్‌ పోర్టల్‌కి లాగిన్‌ కావాలని సూచించారు. ఆసక్తి అర్హత కలిగిన వారు వచ్చేనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం విజయవాడ మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ప్రాంతీయ కార్యాలయంలో స్వయంగా కానీ, 0866–2434868, 7382929642 నంబర్లలో కానీ సంప్రదించాల్సిందిగా కోరారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యా పురస్కారానికి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో సెప్టెంబర్‌ ఐదో తేదీన సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. దానికి గాను జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ యజమాన్య పరిధిలోని అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండి, విద్యాశాఖ నిర్ణయించిన అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారులకు తమ దరఖాస్తులను గడువులోపు సమర్పించాలని వివరించారు.

చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ జె.సత్యవతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి ఇంటర్మిడియట్‌ చదివిన ఎస్సీ నిరుద్యోగ యువకులు కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌ (10వ తరగతి పాస్‌), డ్రోన్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌ (8వ తరగతి పాస్‌), అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌ (10వ తరగతి పాస్‌), సోలార్‌ పీవీ ఇన్‌స్టాలర్‌ (సూర్యమిత్ర) (ఇంటర్మీడియట్‌ పాస్‌), ఎలక్ట్రికల్‌ వెహికల్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌ (8వ తరగతి పాస్‌), బ్యూటీ థెరపిస్ట్‌ (10వ తరగతి పాస్‌), ప్లంబర్‌ – జనరల్‌ కోర్సులు (10వ తరగతి పాస్‌)లలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 21 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసు ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత పత్రాలు, ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు నకళ్లతో ఐదురోజుల్లోగా ఎస్సీ కార్పొరేషన్‌ మచిలీపట్నం కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9848214161, 9652057244 నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement