రెండేళ్ల క్రితం శ్రావణమాసంలో గ్రామాల్లో పర్యటించిన ప్రచార రథం
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ అమ్మ వారి ఆలయ ప్రచార రథం ఆలయ సత్రాల్లోని షెడ్డుకు పరిమితమైంది. భక్తుల విరాళాలతో ప్రచార రథాన్ని సమకూర్చారు. మొదట్లో గ్రామాల్లో అమ్మవారి శాంతి కల్యాణాలు నిర్వహించేటప్పుడు, పలు ఉత్సవాల సమయంలో అధికారులు అమ్మవారి ప్రచార రథాన్ని వినియోగించేవారు. ఇటీవల శాంతి కల్యాణాలు తగ్గాయి. దీంతో భక్తులు రూ.లక్షలు వెచ్చించి ఇచ్చిన ప్రచార రథం షెడ్డుకు పరిమతమైంది. రెండేళ్ల క్రితం శ్రావణ మాసం సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో కొలువై ఉన్న గ్రామ దేవతలకు ఆలయం తరఫున శ్రావణపట్టీ సమర్పించేందుకు ప్రచార రథంలో మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ల టంతో ఎంతో ప్రచారంతో పాటు ఆధ్మాత్మిక భావం వెల్లువిరిసింది. అమ్మవార్లకు చీర, రవిక, పూలు, పసుసు, కుంకుమతో పాటు పండ్లు అందజేశారు. అయితే ఇదే సమయంలో అక్కడక్కడ కొంత ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపి వేశారు. కార్యక్రమం నిలిపి వేయటంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా.. అమ్మవారి శాంతి కల్యాణం కావా లని భక్తులు అడిగితే ఆ గ్రామాలకు ప్రచార రథాన్ని పంపిస్తామన్నారు. గతంలో శ్రావణ పట్టీ కార్యక్ర మంలో భాగంగా కొన్ని ఇబ్బందులు వల్ల ప్రజార రథాన్ని వాడటంలేదన్నారు. ఈ ఏడాది నాలుగో శ్రావణ శుక్రవారం ఆలయంలో సామూహిక వరలక్ష్మీవ్రతం జరుగుతుందని తెలిపారు.


