ౖరెల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పునరుత్పాదక ఇంధన దినోత్సవం సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే హరిత పురోగతి దిశగా పరుగులుతీస్తోందని విజయ వాడ డీఆర్‌ఎం మోహిత్ సొనాకియా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. భారతీయ రైల్వే 2030 నాటికి సున్నా కార్బాన్ ఉద్గారిణిగా మార్చాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా విజయవాడ రైల్వే డివిజన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లోనే 19.9 లక్షల స్వచ్ఛ ఇంధన యూనిట్లను ఉత్పిత్తి చేయడం ద్వారా రూ.185.54 లక్షలను ఆదా చేసిందని పేర్కొన్నారు. డివిజన్‌లో 265 రూఫ్‌టాప్, స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలేషన్ల ద్వారా ఉపయోగిస్తున్న సౌర విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 4.864 కిలోవాట్లకు చేరిందని పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డివిజన్‌లో 44,06,903 యూనిట్ల సౌర విద్యుత్ శక్తికి ఉత్పత్తి ద్వారా రూ.461.40 లక్షలు ఆదా చేయడంతో పాటుగా 3,525.52 టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్య 19,90,741 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా రూ.185.54 లక్షలు ఆదా చేయడంతో పాటుగా 1,592.59 టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించా మని తెలిపారు. డివిజన్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటుగా ఇంధన ఆదా దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా డివిజన్‌లో పూర్తిగా ఎల్‌ఈడీ లైటింగ్ ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. రన్నింగ్ రూమ్‌లు, విశ్రాంతి గృహాలు, ఆస్పత్రుల్లో రోజులకు 56,700 లీటర్ల సామర్థంతో సోలార్ వాటర్ హీటర్‌లను ఏర్పాటు చేశామన్నారు.


