మహత్తర ఆభరణమై.. | - | Sakshi
Sakshi News home page

మహత్తర ఆభరణమై..

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

మహత్తర ఆభరణమై.. 2023లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేసిన పనులివే..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే దుర్గగుడికి మాస్టర్‌ ప్లాన్‌ 2023లో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన నాటి పునాదులపై.. నేడు అభివృద్ధి ఫలాలు సిద్ధమైన అన్నదానం, లడ్డూ పోటు భవనాలు

వరాల తల్లి సాక్షిగా నేడు ఆవిష్కృతం కానున్న కొత్త నిర్మాణాలు

బృహత్తర సంకల్పమే..

ప్రారంభోత్సవానికి సిద్ధమైన

లడ్డూ తయారీ భవనం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కనకదుర్గమ్మ గుడి అభివృద్ధికి వైఎస్సార్‌ సీపీ హయాంలోనే బీజం పడింది. ఇంద్రకీలాద్రిపై ఈ పనుల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం రూ. 72కోట్లు కేటాయించింది. ఆ తర్వాత దాతల సహకారంతో ఐదు కోట్ల రూపాయలతో నూతన యాగశాల నిర్మాణం జరిగింది. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూల్చివేసిన లడ్డూ ప్రసాదాల పోటు స్థానంలో ఐదు కోట్లతో నూతన పూజా మండపాల నిర్మాణం సైతం చేపట్టింది. నూతన పూజా మండపం కొన్ని నెలల కిందట అందుబాటులోకి రాగా, 2023లో సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటులు ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.

రూ. 53కోట్లతో అన్నదాన భవనం, లడ్డూ ప్రసాదం పోటు

దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు 2023 డిసెంబర్‌ ఏడో తేదీన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేపట్టిన పనులలో కొన్ని ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది అన్నదాన భవనం రూ. 26కోట్లతో నిర్మించారు. గ్రౌండ్‌, మొదటి అంతస్తులుగా నిర్మించిన ఈ భారీ భవనంలో ఒకేసారి 800 మంది కూర్చుని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించే వీలు కలుగుతుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అన్న ప్రసాద తయారీ, మెయిన్‌ ప్రోవిజన్‌ స్టోర్స్‌, అన్నదానం స్టోర్స్‌తో పాటు సరుకులు పాడైపోకుండా ఉండేలా కోల్డ్‌ స్టోరేజీలను నిర్మించారు. ప్రస్తుతం దేవస్థానంలోని మహామండపం రెండు, మూడు అంతస్తులను అన్నదానం నిమిత్తం వినియోగిస్తున్నారు. ఒకే దఫా 250మంది మాత్రమే అన్న ప్రసాదం స్వీకరించే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలలో ఎనిమిది వేల మందికి అన్న ప్రసాదం అందుతోంది. నూతన అన్నదాన భవనం ప్రారంభోత్సవం అయిన తర్వాత రోజుకు పదివేల మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుంది. ఇకపై మల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వెళ్లే వారికి సైతం అన్న ప్రసాదం అందుతుంది.

రూ.26.50కోట్లతో లడ్డూ తయారీ కేంద్రం

గోశాల, మహా మండపం మధ్యన ఉన్న స్థలంలో జీ+3 భవనంలో లడ్డూపోటును ఏర్పాటు చేస్తున్నారు. సెల్లార్‌, పై అంతస్తులో లడ్డూ తయారీ, మొదటి అంతస్తులో లడ్డూ విక్రయ కౌంటర్లు, రెండో అంతస్తులో చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ ప్యాకింగ్‌లు జరుగుతాయి. అయితే లడ్డూ తయారీ కేంద్రంలోని మొదటి అంతస్తులో ప్రసాదాల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దేవస్థానం ఆవరణలో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేస్తే భక్తులకు అందుబాటులో ఉంటుందన్న అభిప్రాయాన్ని దేవస్థాన సిబ్బంది సైతం వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక..

2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడి, కృష్ణానది పరిసరాల్లో బొడ్డుబొమ్మ, సీతమ్మ వారి పాదాలు, శనైశ్వర స్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, వినాయకుడి ఆలయాలను నిర్మించింది. ఆ తర్వాత దాతల సహకారంతో నూతన యాగశాల, మల్లేశ్వర స్వామి వారి ఆలయం పున నిర్మాణం, ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు విరిగి పడకుండా పనులు చేపట్టింది.

2016 అంటే భక్తులకు గుర్తుకు వచ్చేది కృష్ణానది పుష్కరాలు. అయితే కృష్ణా పుష్కరాల పేరిట దుర్గ గుడితో పాటు కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో అప్పటి తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు చేసిన ఆలయాల విధ్వంసాన్ని నగర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతా ల్లో పలు ఆలయాలను ధ్వంసం చేయగా, దుర్గ గుడిలో కీలక కట్టడాలను సైతం కూల్చివేసింది. వాటిలో ప్రధానమైనవి ఘాట్‌రోడ్డు మార్గంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌, భవానీ దీక్షా మండపం, దేవస్థాన పరిపాలనా భవనాలు, ఆలయం వెలుపల ఉండే లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం, అన్న ప్రసాద వితరణ కేంద్రంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం, గోశాలలోని పురాతనమైన కృష్ణుడి మందిరాలను కూల్చివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement