సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం | - | Sakshi
Sakshi News home page

సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి

చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్‌ వద్ద జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన జాతీయజెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎస్‌.వరలక్ష్మి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో...

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ జాతీయజెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లోని తెలుగుతల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ నమ్రతా అగర్వాల్‌, డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ నీలకంఠేశ్వరరెడ్డి, ఐఅండ్‌పీఆర్‌ డీడీ జయరావు, కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక, కలెక్టరేట్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలోని 2026–2027 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్‌.చంద్రకళ తెలిపారు. స్కూల్‌ అసి స్టెంట్‌లకు రూ.12,500, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు రూ.10,000 గౌరవ వేతనంతో ఈ పోస్టులు భర్తీ చేస్తారన్నారు. జిల్లాలోని వివిధ మండ లాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లకు సబ్జెక్ట్‌ల వారీగా 81, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు రెండు ఖాళీలు ఉన్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో ఈ నెల 21 లోపు దర ఖాస్తులు అందజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement