కృష్ణా జిల్లాలో పలువురికి సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో పలువురికి సేవా పతకాలు

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

ఫుట్‌బాల్‌ టోర్నీ విజేతగా అనంతపూర్‌ జిల్లా

కోనేరుసెంటర్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కృష్ణా జిల్లా పోలీసుశాఖ తరపున పలువురు ప్రభుత్వం నుంచి పలు సేవా పతకాలు అందుకోనున్నారు. పతకాలకు ఎంపికై న సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు శుక్రవారం అభినందనలు తెలియజేశారు. ఈ రమణమ్మ (ఉమెన్‌ సీఐ) సీసీఎస్‌ గుడివాడ, వీజే రామమూర్తి, (ఏఎస్సై) ఒర్లగొంది తిప్ప ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. అలాగే అలీబేగ్‌ (ఎస్సై), జె.శ్రీనివాస (ఏఎస్సై), ఎం.దక్షిణమూర్తి (హెచ్‌సీ), బి.భద్రు (ఏఆర్‌ఎస్సై), బి.ఆది (పీసీ), పి.ప్రసాద్‌ (హెచ్‌సీ), కె.చంద్రబాబు (హెచ్‌సీ), వి.విజయ్‌ (పీసీ)లు సేవా పతకాలను అందుకోనున్నారు. జి.నాగమల్లేశ్వరరావు (హెచ్‌సీ), బి.నాగశ్రీనివాసప్రసాద్‌ (ఏఆర్‌హెచ్‌సీ), ఎన్‌.పిచ్చేశ్వరరావు (ఏఆర్‌హెచ్‌సీ), బి.వెంకటసుబ్రహ్మణ్యం (హెచ్‌సీ), పి.రమేష్‌బాబు (హెచ్‌సీ), టి.ఏడుకొండలు (హెచ్‌సీ), ఎస్‌.కృష్ణమూర్తి (హెచ్‌సీ), జి.తిరుమలమహేశ్వరరావు (హెచ్‌సీ), ఎల్‌.ప్రసాద్‌ (హెచ్‌సీ)లు

అతి ఉత్కృష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. వీరితో పాటు వై.రవికిరణ్‌ (ఆర్‌ఐ), కె.రామకృష్ణ (హెచ్‌సీ), జె.లక్ష్మణరావు (ఏఆర్‌పీసీ), వై.వెంకటనారాయణ (ఏఆర్‌పీసీ), ఎం.గంటాదుర్గారావు(పీసీ), టి.సుదీర్‌ (ఏఆర్‌హెచ్‌సీ), కె.సుధీర్‌ (ఏఆర్‌హెచ్‌సీ), కె.రామకృష్ణ (పీసీ), కె.గోవింద (పీసీ), జి.జగ్గయ్య (పీసీ), పి.శివశంకర్‌ (పీసీ), ఎస్‌.రాజ (పీసీ), కె.ఏడుకొండలరావు (పీసీ)లు ఉత్కృష్ట సేవా పతకాలను అందుకోనున్నట్లు శుక్రవారం ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. వీరంతా శనివారం జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ చేతుల మీదుగా పతకాలు అందుకోనున్నారు.

మైలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ (2026– 2027 సీజన్‌ సబ్‌ జూనియర్‌ బాయ్స్‌) టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించే ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాధిక చారిటబుల్‌ ట్రస్టు సహకారంతో నిర్వహించే ఈ పోటీల్లో చివరి రోజు శుక్రవారం సెమీఫైనల్స్‌లో ఏఎస్‌ఆర్‌ జిల్లా జట్టు సత్యసాయి జిల్లా జట్టుపై 1– 0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరో సెమీ ఫైనల్‌లో కృష్ణా జట్టుపై అనంతపురం జట్టు పెనాల్టీలలో 5– 3 గోల్స్‌ తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్‌లో అనంతపురం జట్టు అల్లూరి సీతారామరాజు జిల్లాపై పెనాల్టీలతో 5– 4 విజయం సాధించి టోర్నమెంట్‌ విజేతగా నిలిచింది. తృతీయ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సత్యసాయి జిల్లా కృష్టా జిల్లాపై 1–0గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ వై.శేషగిరిరావు, ట్రెజరర్‌ చక్రవర్తి, కోనసీమ జిల్లా కార్యదర్శి నీలాద్రి, కృష్ణాజిల్లా ఫుట్బాల్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ జి. అనిల్‌, ఏలూరు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి. పవర్‌కుమార్‌, ఇతర జిల్లాల ఫుట్బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రపంచ ఆర్చరీ పోటీల్లో యుక్తశ్రీ ప్రతిభ

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దక్షిణ కొరియాలోని ఇన్‌చియాన్‌లో ఈ నెల 10 నంచి 14వ తేదీ వరకు జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్‌ ఇన్విటేషనల్‌–2026 పోటీల్లో కొండపావులూరి యుక్తశ్రీ, కృషి కుమావత్‌, ప్రాజల్‌ తోలియా జట్టు బంగారు పతకాన్ని పొందింది. ఈ జట్టు మన దేశం తరపున బాలికల రికర్వ్‌ విభాగంలో ప్రతిభభ చూపి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ బంగారు పతకం సాధించడంలో విజయవాడ నగరానికి చెందిన యుక్తశ్రీ కీలక పాత్ర వహించింది. ఫైనల్‌లో సౌత్‌ కొరియాపై 3–5 తేడాతో ఈ జట్టు గెలుపొందింది. బంగారు పతకాన్ని పొందిన జట్టులోని సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు నందమూరి తేజస్విని, ఛైర్మన్‌ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.వి.రమణ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement