రవాణాశాఖ కార్యదర్శికి లారీ యజమానుల సంఘం వినతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్– తెలంగాణల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని ఏపీ లారీ యజమానుల సంఘం నేతలు శుక్రవారం రవాణాశాఖ కార్యదర్శి కోన శశిథర్‌ను కలిసి విన్నవించారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కోన శశిథర్‌ను లారీయజమానుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరారు. కాగా రవాణా శాఖ కార్యదర్శిని కలిసిన వారిలో ఆ సంఽఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు నాగమోతు రాజా తదితరులు ఉన్నారు.


