మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీయాలి

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీయాలి గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైజ్‌ కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. గుంటుపల్లి రైజ్‌ కేంద్రంలో సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌పోను కలెక్టర్‌ శనివారం సందర్శించారు. పారిశ్రామిక యూనిట్ల ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన 27 స్టాళ్లను పరిశీ లించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. రైజ్‌ కేంద్రం ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకునేలా ప్రోత్సహించడం, చిన్నస్థాయి వ్యాపారాలను అభివద్ధి చేసుకునేందుకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్‌.వి.నాంచారరావు, డీపీఎం ఎ.శ్రీనివాసరావు, రైజ్‌ మేనేజర్‌ బి.తేజస్విని తదితరులు రేపు పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు సుగాలీ మహిళలపై కేసు ఇబ్రహీంపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజేష్‌ తమతో పనులు చేయించు కుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరో పిస్తూ జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన కొందరు సుగాలీ మహిళలు శుక్రవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేయడంపై ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. కట్టుబడిపాలెంనకు చెందిన బాణావత్‌ రాజు నాయక్‌, తండ్రి రాముతో పాటు మరికొందరు సుగాలి కులాచార దుస్తులు ధరించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడి వద్ద సారె సమర్పించేందుకు పాదయాత్రగా బయలుదేరి రోడ్డుపై బైఠాయించారు. విజయవాడ వైపు రోడ్డును దిగ్బంధించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. రోడ్డును దిగ్బంధించిన నేపథ్యంలో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హోమ్‌ ట్యూషన్‌ టీచర్‌ అనుమానాస్పద మృతి

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నగరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరేందుకు సోమవారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్‌ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి రెండు విడతల కౌన్సెలింగ్‌లలో మిగిలిన సీట్లను ఈ స్పాట్‌ అడ్మిషన్లలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్‌–2026 పరీక్ష రాసిన, రాయని వారు పాల్గొనవచ్చని సూచించారు. అభ్యర్థులు సోమవారం ఉదయం పది గంటలకు తమ విద్యార్హతా ఓరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలతో కళాశాలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పదస్థితిలో హోమ్‌ ట్యూషన్‌ టీచర్‌ ఓ లాడ్జిలో మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పెనమలూరు మండలం, తాడిగడపకు చెందిన లక్ష్మీపురపు వెంకటరమణ, కుటుంబరావు (59) భార్యాభర్తలు. వారి కుమార్తెకు వివాహమై సౌత్‌ఆఫ్రికాలో ఉంటుండగా, కుమారుడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. భర్యాభర్తలిద్దరూ హోమ్‌ ట్యూషన్లు చెప్పుకొని జీవిస్తున్నారు. కుటుంబరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల నాలుగున ట్యూషన్‌ చెప్పడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో కృష్ణలంక ఫీడర్‌రోడ్డులో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న లాడ్జి సిబ్బంది వెంకటరమణకు ఫోన్‌చేసి కుటుంబరావు శుక్రవారం ఉదయం తమ వద్ద రూమ్‌ తీసుకున్నారు, అద్దె చెల్లించాలని చెప్పారు. తన భర్త మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో అతను కనిపించడంలేదని పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటరమణ బదులిచ్చారు. అనంతరం పకీర్‌గూడెంలో నివసించే కుటుంబరావు సోదరుడు వెంకట సత్యనారాయణకు సమాచారం విచ్చారు. ఆయన లాడ్జి వద్దకు వెళ్లి చూడగా కుటుంబరావు తీసుకున్న రూమ్‌ తలుపులు వేసి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుటుంబరావు విషం తాగి బెడ్‌పై పడి ఉన్నాడు. అంబులెన్స్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని అతడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువకుడి బలవన్మరణం

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటిలో ఎవరూ లేని సమయంలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. కృష్ణలంక పోలీసుల కథనం మేరకు.. రాణిగారి తోట ముక్కు శ్రీరామిరెడ్డి రోడ్డుకు చెందిన కాయల రాము ఉడ్‌ పాలిష్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు సూర్యచంద్ర మొబైల్‌ రిపేర్‌ పనిచేస్తుండగా చిన్న కుమారుడు పవన్‌కుమార్‌(22) కొద్దిరోజులు వన్‌టౌన్‌లోని ఓ షాపులో పనిచేశాడు. ప్రస్తుతం పని మానేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. శనివారం ఉదయం రాము పనికి వెళ్లాడు. ఆ తరువాత రాము పెద్ద కుమారుడు షాపునకు వెళ్లి తిరిగి రెండు గంటల సమయంలో భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో దగ్గరగా ఉన్న ఇంటి తలుపులు తెరిచి లోపలకి వెళ్లి చూడగా పవన్‌కుమార్‌ వంటగదిలో స్లాబ్‌ కొక్కేనికి చీరతో ఉరేసుకొని వేలా డుతూ కనిపించాడు. వెంటనే సూర్య చంద్ర తన బంధువుల సహాయంతో పవన్‌ను కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి పవన్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement