సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

● మొవ్వ మండలం మొవ్వ గ్రామానికి చెందిన వ్యాపారస్తులు ఎస్‌. ఉదయ్‌, భాను, ఎస్‌కే అమీర్‌, ఎం. లోకేష్‌లు పంచాయతీ కొత్త షాపుల నెల వారీ అద్దెను పునః పరిశీలించి తగ్గించాలని కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ● తోట్లవల్లూరు మండలం కవిగిరిలంక గ్రామస్తులు కె. శారద, జి. అనూష, కె. శివపార్వతి, జి పద్మ, ఆర్‌. రమేష్‌బాబు, కె. సాంబశివరావు తమ వ్యాపార భూములు ఆన్‌లైన్‌లో నమోదు చేసి అడంగల్‌ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. పాసు పుస్తకాలు లేక పోవడం వల్ల ప్రభుత్వం పథకాలను పొంద లేక పోతున్నామని వివరించారు. ● పామర్రులోని గఫార్‌సెంటర్‌కు చెందిన మటన్‌ మార్కెట్‌ వర్తకులు తన షాపులు శిథిలావస్థకు చేరాయని, వాటిని కూల్చి కొత్త షాపులు నిర్మించాలని కోరారు.

పామర్రు: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం పామర్రు నియోజకవర్గ కేంద్రమైన పామర్రులోని ఎస్‌కేఆర్‌ఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణమండపంలో ‘మీ కోసం’ను నిర్వహించారు. కలెక్టర్‌ ప్రజల నుంచి మొత్తం 30 వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులకు పంపించి, నిబంధనల మేరకు త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌, సహాయ కలెక్టర్‌ సమ్రత అగర్వాల్‌, డీఎస్సీ పల్లా శ్రీనివాసరావు, పామర్రు తహసీల్దార్‌ జి. రవికాంత్‌, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement