గూడూరు: అమరావతి చాంపియన్ షిప్–2026లో భాగంగా అండర్–17 బాలుర, బాలికల హాకీ జట్ల ఎంపిక శుక్రవారం గూడూరులో నిర్వహించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో నిర్వహించిన సెలక్షన్స్‌కు ఇటీవల నియోజకవర్గ స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు 90మంది హాజరయ్యారు. వీరి నుంచి అండర్–17లో 16 మంది చొప్పున బాలుర, బాలికల జట్లకు ఎంపిక చేశారు. మరో ముగ్గురు క్రీడాకారులను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. వీరంతా రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు హాజరవుతారని డీఎస్‌డీఓ ఝాన్సీలక్ష్మి తెలిపారు. అంతకుముందు గూడూరు తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి హాకీ జట్ల సెలక్షన్స్‌ను ప్రారంభించగా, జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, కోశాధికారి విఠల్, గూడూరు హాకీ క్లబ్ కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మత్తి అరుణ అభినందించారు.


