పోలీస్ స్టేషనా.. టీడీపీ కార్యాలయమా?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని పామర్రు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్‌పైనే పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా పెట్టిన పోస్టింగ్‌లకు సంబంధించి ఆధారాలతో స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ నేతలు వల్లూరిపల్లి గణేష్, కుదరవల్లి ప్రవీణ్ చంద్ర తదితరులపై కేసు నమోదు చేయాలని కై లే అనిల్ కుమార్ పోలీసు స్టేషన్‌కు వెళితే, ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ మార్క్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనడానికి నిదర్శనం.
అవినీతి దందాను ప్రశ్నిస్తున్నందుకే..
నియోజకవర్గంలో ఇసుక, మట్టి, పేకాట, అక్రమ లేఅవుట్లు.. ఇలా టీడీపీ ప్రజా ప్రతినిధికనుసన్నల్లో టీడీపీ నేతలు చేయని దందానే లేదు. ఈ దందాను కై లే అనిల్‌కుమార్ ప్రశ్నించడంతో పాటు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిని జీర్ణించుకోలేకే అక్రమ కేసుల నమోదుకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అక్రమ కేసుల పరంపర..
కృష్ణాజిల్లా పామర్రు పోలీసు స్టేషన్ టీడీపీ ఆఫీసుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రజా ప్రతినిధికి జీ హుజూర్ అంటూ పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు.
● గత ఏడాది వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తుపానుకు దెబ్బ తిన్న పంట పొలాల పరామర్శ సందర్భంగా ఆయనకు తమ సమస్యలను చెప్పేందుకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇది ఏమిటని ప్రశ్నించిన కై లే పైన తప్పుడు కేసు పెట్టారు.
● మొవ్వ మండలంలో రైతుల తరఫున యూరియా కోసం ధర్నా చేస్తే కేసు పెట్టారు.
● మచిలీపట్నంలో మెడికల్ కళాశాల సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుని అక్రమ కేసు బనాయించారు.
● పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత నేత పృథ్వీపై అన్యాయంగా కేసులు నమోదు చేయటమే కాకుండా అతనిపై రౌడీషీటు ఓపెన్ చేశారు.
సోషల్ మీడియాలో పెట్టిన
అక్రమ పోస్టులపై చర్యలు
తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే
కై లే ఫిర్యాదు
విధులకు ఆటంకం కలిగించారంటూ
కై లే పైనే తిరిగి కేసు నమోదు
టీడీపీ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో
పామర్రు పోలీసు స్టేషన్
ఒక మాజీ శాసనసభ్యుడిగా తనపై జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు చేస్తే, తనపైనే కేసు నమోదు చేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో టీడీపీ వారి ఫిర్యాదులే స్వీకరిస్తారా.. ప్రతిపక్ష నేతలు, సామాన్య ప్రజల ఫిర్యాదులు తీసుకోరా అని నిలదీశారు. పోలీస్ స్టేషన్ అని బోర్డు తీసి టీడీపీ కార్యాలయం అని బోర్డు పెట్టుకోండని హితపు పలికారు.


