వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయిలో జగనన్న 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): జగనన్న 2.0 సూపర్ యాప్‌తో ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పలువురు నేతలతో కలిసి జగనన్న 2.0 సూపర్ యాప్‌ను అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామం, మండలం, వార్డులో పార్టీ నాయకుడికీ, కార్యకర్తకు మధ్య ఒక బలమైన అనుసంధాన వారధిగా ఈ యాప్ ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ యాప్ లాంచ్ చేస్తామని, ప్రతి పార్టీ కార్యకర్త ఈ యాప్‌తో అను సంధానమై, ప్రభుత్వ తప్పుడు పనులను అందులో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ యాప్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్ర పుణ్యశీల, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి “jagan 2.0 Super App’ ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


