నీట ముంచిన నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నీట ముంచిన నిర్లక్ష్యం

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

తొలకరి ముందు బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు ప్రారంభం పట్టిసీమ నీటి రాకతో నిలిచిన డైవర్షన్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు ప్రభుత్వ తీరుతో నిర్మాణ దశలో మునిగిన బ్యాలెన్స్‌ రిటైనింగ్‌ వాల్‌ భారీ వర్షం పడితే మరోసారి వరద ముంపు ప్రమాదం

భారీ వర్షాలు కురిస్తే ప్రమాదమే..

జి.కొండూరు: బుడమేరు ఉగ్రరూపం దాల్చి డైవర్షన్‌ కెనాల్‌కు గండ్లు పడటంతో వరద ముంపు నకు గురై రెండేళ్లు కావస్తున్నా ప్రజల్లో బుడమేరు భయాన్ని తొలగించడంలో ప్రభుత్వం సఫలం కాలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ ఆధునికీకరణ పనులకు పెను శాపంగా మారింది. గండ్ల వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులే ఏడాదిగా పూర్తి చేయలేని ప్రభుత్వం లైనింగ్‌ పనులను హడావిడిగా చేపట్టింది. తొల కరి వానలతో ఈ పనులు సైతం నత్తనడకన సాగుతూ పట్టిసీమ నీటి విడుదలతో పూర్తిగా నిలిచిపోయాయి. లైనింగ్‌ పనులు చేస్తున్న యంత్రాలు ఒడ్డుకు చేరాయి. నిర్మాణాలు మునిగిపోయాయి. మరో ఆరు నెలలపాటు ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. లైనింగ్‌ పనుల కోసం కెనాల్‌ గట్లను తవ్వి వదిలేయడంతో పట్టిసీమ నీటి ప్రవాహానికి కోతకు గురవుతు న్నాయి. భారీ వర్షాలు కురిస్తే గండ్లు పడి మరో సారి వరద ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

హడావుడి పనులకు బ్రేక్‌

బుడమేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ ఉంది. ఈ కాలువ అటు బుడమేరు వరద ప్రవాహంతో పాటు ఇటు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే పట్టిసీమ నీటిని సైతం కృష్ణానదిలో కలుపుతుంది. 2024 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌కు భారీ గండ్లు పడి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ రోజుల తరబడి నీట మునిగాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ తర్వాత బుడమేరు ఆధునికీకరణ చేస్తామంటూ ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ నాయకులందరూ ఊదరగొట్టారు. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇటీవల బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ ప్రారంభం నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్‌ పనులకు ప్రభుత్వం రూ.121 కోట్లు మాత్రమే కేటాయించింది. వర్షాలు పడితే ముందుకు సాగవని తెలిసినా మే నెలలో హడావుడిగా ఆలైనింగ్‌ పనులు ప్రారంభించింది. జూన్‌లో తొల కరి జల్లులతో నత్తనడకన సాగిన ఈ పనులు పట్టిసీమ నీటి రాకతో ఈ నెల 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఒకవేళ వర్షాలు కురవకపోతే పట్టిసీమ నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు అధికంగా కురిస్తే ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం డైవర్షన్‌ కెనాల్‌ నుంచే కృష్ణానదిలో కలవాల్సి ఉంది. దీనితో మరో ఆరు నెలల పాటు లైనింగ్‌ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదు.

హడావుడిగా చేపట్టిన లైనింగ్‌ పనులు, బ్యాలన్స్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాలెన్స్‌ రిటై నింగ్‌ వాల్‌ నిర్మాణం కోసం కట్టను ఎడమ వైపు తవ్వి వదిలేయడంతో పట్టిసీమ నీటి ప్రవాహానికి కోతకు గురవుతోంది. ఒకవేళ భారీ వర్షాలు పడి ఎగువ నుంచి వరద పోటెత్తితే, కోతకు గురైన ప్రదేశంలో గండి పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెను ప్రమాదం సంభవించకముందే అధికారులు అప్రమత్తం కావాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement