రెండు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత
గుణదల(విజయవాడ తూర్పు): ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిఽధిలోని గుణదల ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం, గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన ఇద్దరు బాలికలు ఉన్నట్టుండి కన్పించకుండా పోయారు. విషయం తెలిసిన తలిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లలో, బంధువుల నివాసాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలికల తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసిన మాచవరం సీఐ చంద్రశేఖర్ ఆయా ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలించారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే బందరు రోడ్డు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
జగ్గయ్యపేట: మండలంలోని వేదాద్రి గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని పంట పొలాల వద్ద మృతదేహం ఉన్నట్లు సోమవారం గ్రామస్తులు సమాచారం అందించటంతో సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


