మళ్లీ చుక్క పెట్టేశారు
22ఏ భూములపై తక్షణం
కోడూరు(అవనిగడ్డ): 22ఏ జాబితాలోని భూములపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 22ఏ జాబి తాలో భూములపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్ ఎన్.పద్మప్రియకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి ప్రధాన సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దే శించి సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ.. 2016లో చంద్రబాబు ప్రభుత్వం అవనిగడ్డ నియో జకవర్గంలోని వేలాది ఎకరాల భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని)తో కలసి ఎన్నోసార్లు ఆందోళనలు చేశామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధిత భూముల సమస్య పరిష్కారమైందని గుర్తుచేశారు. 2022 అక్టోబర్‌లో అవనిగడ్డలో జరిగిన బహిరంగసభలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిషేధిత జాబితా నుంచి తొలగించగా నియోజకవర్గంలో 17,857 ఎకరాల్లో భూములకు విముక్తి కలిగిందని వివరించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో భూముల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.
50 ఏళ్లయినా రాజధానిని పూర్తి చేయలేరు
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల పాలనలో అమరావతి రాజధాని కోసం కేవలం రూ.8 వేలకోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ లెక్కన రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే 50 ఏళ్ల అయినా సాధ్యం కాదని సింహాద్రి రమేష్‌బాబు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, కమీషన్లు దండుకునేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ వేల ఎకరాలు అడుగుతోందని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్‌ను రాజధానిగా చేస్తే రూ.కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనిని ప్రక్కదారి పట్టించేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ నాయకుల కుటుంబ సభ్యుల మహిళలను కించపరిచేలా విధంగా తన చానల్‌లో ప్రసారం చేశారని విమర్శించారు. ఇది ఏ రకమైన జర్నలిజమో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువనేత సింహాద్రి వికాస్ మాట్లా డుతూ.. నిషేధిత జాబితా నుంచి చుక్కల భూము లను తొలగించక పోతే ఆందో ళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవనిగడ్డ వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కోడూరు తహసీల్దార్ కార్యాలయం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల మండలాల పార్టీ కన్వీనర్లు పరిశే మాధవరావు, రేపల్లె శ్రీనివాసరావు, భోగాది శేషగిరిరావు, గరికపాటి వెంకటేశ్వరరావు, వేమూరి వెంకట్రావ్, అవనిగడ్డ, చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, రాజులపాటి కల్యాణి, నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, కొండవీటి వెంకటనారాయణ, సామర్ల రాంబాబు, గాజుల జయగోపాల్, నలుకుర్తి రమేష్, గుర్రం బసవయ్య, నలుకుర్తి పృథ్వీ రాజ్, యోగ ప్రకాష్, ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
పాస్ బుక్‌లపై జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు వేస్తే మీ భూములు లాక్కుంటారని గత ఎన్నికల్లో కూటమి నేతలు విషప్రచారం చేశారని, వారు అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధిత భూములకు మళ్లీ చుక్క పెట్టడం వల్ల వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పేర్కొన్నారు. చేతిలో భూములు ఉన్నా ఎందుకూ ఉపయోగ పడటం లేదని, ఇటీవల వేకనూరుకు చెందిన రైతు రూ.8 లక్షలకు పైగా అప్పులు పెరిగి పోవడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి నిషేధిత జాబితా సమస్యను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు డిమాండ్ చేశారు.
ధర్నాలో మాజీ ఎమ్మెల్యే
సింహాద్రి రమేష్‌బాబు


