
ఒకేరోజు నాలుగు దేవాలయాల్లో చోరీలు
భయపడుతున్న కోసూరు ప్రజలు
కోసూరు(మొవ్వ): మొవ్వ మండలం కోసూరులో ఒకేరోజు రాత్రి వేళ నాలుగు దేవాలయాల్లో వరస దొంగతనాలు జరిగాయి. గ్రామం నడిబొడ్డున సెంటర్ లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం, పక్కనే ఉన్న క్షత్రియ రామాలయంలో తాళాలు పగలగొట్టి లక్షలాది రూపాయలు విలువ చేసే 9 వెండి కిరీటాలు, రుద్రపాదుకలతో పాటు పలు వెండి ఆభరణాలు అపహరించారు.
గ్రామంలోని గంగానమ్మ మందిరం, శ్రీ వినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి... నగదు ఎత్తుకెళ్లారు. పామర్రు సీఐ వి.శుభాకర్, కూచిపూడి ఎస్‌ఐ విశ్వనాథ్ ఘటనా స్థలాలను పరిశీలించి దేవాలయాల నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించారు. మచిలీపట్నం నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రల సేకరించగా డాగ్ స్వాడ్ ఘటనా స్థలంలో తనిఖీలు చేసింది. వరస దొంగతనాలు కోసూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.