
అనేక లోపాలు గుర్తించాం
విజయవాడలో నిర్వహించిన తనిఖీల్లో అనేక లోపాలు గుర్తించాం. హోటళ్లు, రెస్టారెంట్‌లలో వండిన రైస్, చికెన్, మటన్ వంటి వాటిని సైతం డీప్ ఫ్రిజ్‌లలో పెట్టి, మళ్లీ వాటిని వాడుతున్నారు. మితిమీరిన రసాయనాలు కలిసిన రంగులను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కాలపరిమితి ముగిసిన సరుకులను కూడా ఆహారం తయారీకి వాడుతున్నారు. బ్యాకరీ ప్రొడక్ట్స్‌పై సరైన లేబుల్స్ లేని విషయాన్ని తనిఖీల్లో గుర్తించాం. అంతేకాకుండా వంటనూనెనే రీ యూజ్ చేస్తున్నారు. అలా చేస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
–పూర్ణచంద్రరావు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్, ఏపీ