
యువత భవిష్యత్ అందరి బాధ్యత
మచిలీపట్నంఅర్బన్: ఎయిడ్స్‌పై అవగాహన పెంచి యువత భవిష్యత్‌ను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ సాల్మన్‌రాజు పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 5కె మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షిత జీవన శైలిని అనుసరించడం ద్వారా ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించవచ్చన్నారు. స్థానిక చిలకలపూడి సెంటర్ నుంచి నోబుల్ కళాశాల వరకు జరిగిన ఈ మారథాన్‌లో 75మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో బి.పవన్ కళ్యాణ్ (నోబుల్ కళాశాల), కారే కార్తికేయ (రుద్రపాక జూనియర్ కళాశాల), బి.లోకేష్ (మొవ్వ జూనియర్ కళాశాల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో షేక్ అయేషా (నోబుల్ కళాశాల), టి. చైతన్యలక్ష్మి (మొవ్వ జూనియర్ కళాశాల), చింతగుంట కళ్యాణి (రుద్రపాక జూనియర్ కళాశాల)వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు నగదు బహుమతులుగా వరుసగా రూ.10వేలు, రూ.7వేలు, 5వేలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ డాక్టర్ వెంకటరావు, జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూదనరావు, సీఎస్‌వో సాక్షి గోపాల్, నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.జె. ఎర్నెస్ట్, లెక్చరర్లు పి.వి.నరసింహారావు, రంగనాయకులు, ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు.