
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
పెడన: బంధువు అంత్యక్రియలకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెడనలో జరిగింది. స్థానిక మునిసిపల్ వాటర్ హౌస్‌కు వెళ్లే మార్గంలోని పంట కాలువలో గుర్తు తెలి యని మృతదేహం బొక్కాబోర్లాపడి ఉండటంతో శనివారం ఉదయం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ఆ మృతదేహాన్ని బయటకు తీయడంతో మృతుడిని బంధువులు గుర్తించారు. పట్టణంలోని దక్షిణ తెలుగుపాలేనికి చెందిన కోమట్ల శివనాగరాజు (43) శుక్రవారం ఉదయం తమ బంధువు ఒకరు చనిపోవడంతో శ్మశానంలో అంత్యక్రియలకు హాజర్యాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక అందరితో పాటు శివరామరాజు పంట కాలువలో స్నానాకి దిగాడు. అందరూ వెళ్లిపోతూ శివనాగ రాజును కూడా రమ్మన్నారు. దీంతో తాను ఈత కొట్టుకుంటూ అందరికంటే ముందుగా వచ్చేస్తానని కాలువలోనే ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతను ఇంటికి వెళ్లిపోయి ఉంటాడని బంధువులు అనుకున్నారు. శనివారం ఉదయం కాలువలో శవమై తేలాడు. కాలువలో మృత దేహాం ఒక కర్రకు చిక్కుకుని ఉండిపోయింది. పెడన సీఐ కె.నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ జి.సత్యనారాయణ, ట్రైనీ ఎస్‌ఐ నాగరాజు ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. వీఆర్వో మోర్ల శ్రీనివాసరావు శవపంచానామ నిర్వహించిన పిమ్మట మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శివనాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు. భార్య జ్యోతితో పదేళ కిందట గొడవపడటంతో కలిదిండి మండలం గోపాలపురంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శివనాగరాజు తల్లి సంపూర్ణమ్మ వద్ద ఉంటున్నాడు. ఇటీవల తల్లిని కూడా తిట్టి, కొట్టడంతో ఆమె కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటున్న శివనాగరాజు మృతి చెంద డంతో అన్నకుమారుడు కోమట్ల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.