కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Aug 24 2025 12:06 PM | Updated on Aug 24 2025 2:10 PM

కృష్ణ

కృష్ణాజిల్లా

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025 డీఎస్సీ ఎస్జీటీలో జిల్లా ఫస్ట్‌ అక్రమ ఆస్తుల కేసులో శైలేంద్ర అరెస్టు –8లోu యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

న్యూస్‌రీల్‌

లోకోస్‌ యాప్‌పై భిన్నాభిప్రాయాలు ఐకేపీ సిబ్బంది స్మార్ట్‌ఫోన్లలో సాంకేతిక సమస్యలు గోప్యత లోపిస్తుందంటూ డ్వాక్రా మహిళల ఆందోళన డేటా నమోదుకూ తంటాలు

యాప్‌లలో నమోదుతో ఇబ్బంది

అవగాహన కల్పించాం..

డ్వాక్రా మహిళల ఆందోళన..

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

7

తిరువూరు: మెగా డీఎస్సీలో ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన భూక్యా జాన్సన్‌ 100కు 95 మార్కులు సాధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎస్జీటీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. జాన్సన్‌ను గ్రామస్తులు అభినందించారు.

అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పరిశ్రమలశాఖ డెప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌

చల్లరపు శైలేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో యూరియాను దారి మళ్లిస్తూ కొరత సృష్టించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డీకె బాలాజీ హెచ్చరించారు. జిల్లాలో యూరియా దారిమళ్లింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన శనివారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావు తదితరులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది కంటే ఈ సీజన్‌లో దాదాపు 17వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అదనంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అయితే కొంతమంది యూరియాను దారి మళ్లిస్తూ కొరత సృష్టిస్తున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యూరియా కేవలం రైతులకు మాత్రమేనని, ఆక్వా పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇందుకోసం డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో, మండలస్థాయిలో తహసీల్దార్‌, జిల్లాస్థాయిలో వ్యవసాయశాఖ అధికారితో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆయా కమిటీలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. చేపల చెరువులు, పరిశ్రమలు సందర్శించి తనిఖీలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అధికంగా యూరియా కొనుగోలు చేసినవారు వ్యవసాయానికి మాత్రమే వినియోగిస్తున్నారా? లేదా డీలర్లు యూరియాను అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్నారా? అని నిగ్గుతేల్చేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యూరియాను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, బీఎస్‌ హేళాషారోన్‌, జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు, మార్క్‌ఫెడ్‌ డీఎం మురళీకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

పెడన: మొబైల్‌ బుక్‌కీపింగ్‌, ఎస్‌హెచ్‌జీ యాప్‌, మెయిన్‌ యాప్‌, సబ్‌యాప్‌ అంటూ డ్వాక్రా గ్రూపులు, అందులోని సభ్యుల వివరాలు, లావాదేవీలు తదితర అంశాల నమోదు కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్‌ల నిర్వహణ ఐకేపీ సిబ్బంది, డ్వాక్రా సభ్యులకు తలనొప్పిగా మారింది.

మహిళా సంఘాల పనితీరు, నెలవారీ సమావేశాలు, రుణాల మంజూరు, చెల్లింపులు, లావాదేవీలన్నింటినీ ఇప్పటివరకు ఐకేపీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో చేస్తూ వచ్చారు. ఇకనుంచి పొదుపు సంఘాల లెక్కలన్నీ పక్కాగా ఉండేలా డ్వాక్రా గ్రూపులు, ఆయా గ్రూపుల్లోని సభ్యుల వివరాలు, వీరి లావాదేవీలు అన్నింటి కోసం రూపొందించిన యాప్‌లో నమోదు చేసేలా చర్యలు చేపట్డడం తలకు మించిన భారంగా మారడంతో డ్వాక్రా గ్రూపుల నిర్వాహకులు, ఐకేపీ సిబ్బంది అవస్థలుపడుతున్నారు.

ఆర్థిక విషయాలు బహిర్గతం!..

రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన ఉమెన్‌ పవర్‌ యాప్‌లో మన డబ్బులు..మన లెక్కలు అంటూ ఒక యాప్‌ ఏర్పాటు చేశారు. లోకోస్‌ యాప్‌ (కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి)లో డ్వాక్రా గ్రూపులు, వారి పూర్తి వివరాలు, మొబైల్‌బుక్‌ కీపింగ్‌, ఎస్‌హెచ్‌జీ యాప్‌ అంటూ సుమారు 15 నుంచి 20రకాల యాప్‌ల్లో ఐకేసీ సిబ్బందితోపాటు డాక్రా గ్రూపు నిర్వాహకులు కూడా ఆయా వివరాలు నమోదు చేయాల్సివస్తోంది. వీటంన్నిటిలో కూడా ఆయా మండలాల్లో గ్రూపుల వివరాలన్ని కూడా నమోదు చేసి ఆన్‌లైన్‌ చేసే పని ఇప్పటికే పూర్తికావచ్చింది. అయితే ఈ యాప్‌లపై డ్వాక్రా మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థికపరమైన విషయాలు బహిర్గతమవుతాయనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీవోఏలు డ్వాక్రా గ్రూపులపై పర్యవేక్షించే వీలేజ్‌ ఆర్గనైజేష్‌ అసిస్టెంట్లు ఈ యాప్‌లతో నరకయాతన అనుభవిస్తున్నారు. అన్ని యాప్‌లలో గ్రూపుల వివరాలను నమోదు చేయడం, కొన్ని సందర్భాలలో నెట్‌ అందుబాటులో లేకపోతే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తుండటంతో రోజంతా ఇదే పని సరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాప్‌లపై శిక్షణ అంతంత మాత్రమే..

ఉమెన్‌ పవర్‌, లోకోస్‌ తదితర యాప్‌ వినియోగంపై జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు, వీవోఏలు అరకొరగానే అవగాహన కల్పించారు. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి వాటిని ఏవిధంగా వినయోగించాలనే అంశంపై ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆయా యాప్‌ల నిర్వహణ డ్వాక్రా గ్రూపు నిర్వాహకుల, ఐకేపీ సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని వారు వాపోతున్నారు.

జిల్లావ్యాప్తంగా 29,283 గ్రూపులు..

కృష్ణాజిల్లా వ్యాప్తంగా 29,293 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఒక్కొ గ్రూపులో పదిమంది సభ్యులు చొప్పున సుమారు 2,92,830 మంది సభ్యులున్నారు. వీరి వివరాలను నమోదు చేయడానికి క్షేత్రస్థాయిలోని వీవోఏలు తలకు మించిన భారమవుతోంది. ఈ యాప్‌లతోనే కాకుండా అదనపు పనిభారంతో సతమతమవుతున్నారు. నిరక్షరాస్యత నిర్మూలన అంశం కూడా క్షేత్రస్థాయిలో వీరికే అప్పగించారు. స్వచ్ఛగ్రామీణ సంరక్షన్‌ కూడా అప్పగించడంతో పనిభారం అధికమై తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. పనిచేయలేమని చెబుతుంటే మీరు మానేస్తే మరొకరు వస్తారంటూ బెదిరింపులకు దిగుతుండటంతో చేసేది లేక పనిభారంతోనే ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరులోగా వివరాల నమోదు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేయడంతో వీవోఏలు మరింత ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమెన్‌ పవర్‌ యాప్‌లో ఓ డ్వాక్రా గ్రూపు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన లావాదేవీలు.. వారు పొదుపు చేసిన నగదు, తీసుకున్న రుణం..చెల్లించిన మొత్తం..పెండింగ్‌ బకాయిలు..పావలా వడ్డీ రుణాలు..ప్రభుత్వ రుణమాిఫీ..పసుపుకుంకుమ కింద పొందిన లబ్ధి తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తున్నారు. డిఫాల్ట్‌ సభ్యుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులకు అనుసంధానం చేశారు. దీంతో మహిళా సంఘాల మొత్తం డేటా ఢిల్లీలో దర్శనమిస్తోంది. పీఎంజీపీ, పీఎంఎస్‌ఎంఈ వంటి రుణాలు బినామీలకు వెళ్లకుండా చెక్‌ పెట్టడానికే అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇలా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సబబుకాదని మహిళలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

డ్వాక్రా మహిళల వివరాలన్నింటిని యాప్‌లలో నమోదు చేస్తున్నారు. కుటుంబసభ్యుల వివరాలతోపాటు గ్రూపు లావాదేవిలన్నింటినీ యాప్‌లో నమో దు చేయడం సబబుకాదు. ఈ యాప్‌లోని అంశాలు బహిర్గతమైతే ఎవరు బాధ్యత వహిస్తారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేయకుండా వివరాలన్నింటిని నమోదు చేయడం సరైన విధానం కాదు. ఈఅంశంపై భరోసా కల్పించాల్సిన బాధ్యత వెలుగు సిబ్బందిపై ఉంది.

– రాజులపాటి వాణి, ఎంపీపీ, పెడన

ఆయా యాప్‌ల వినియోగంపై వెలుగు సిబ్బందితోపాటు క్షేత్రస్థాయిలో మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం.ఎవరికై నా అపోహాలుంటే తక్షణం నివృత్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశాం. సాంకేతిక సమస్యలను సైతం అధిగమిస్తున్నాం. మహిళా సంఘాల పనితీరు మెరుగుపరచడంతోపాటు ప్రతిఒక్కరికి న్యాయం చేసేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడతాయి. – హరిహరనాథ్‌, పీడీ,

డీఆర్‌డీఏ, మచిలీపట్నం

కృష్ణాజిల్లా1
1/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/6

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/6

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement