
ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా
ఆసిఫాబాద్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, మూడేళ్ల పీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలు వెల్లడించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ సి బ్బంది ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ నాయకుడు తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పీఎఫ్, ఈఎస్‌ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని పలుమార్లు అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ చెన్నకేశవను కలిసినా స్పందన లేదన్నారు. కలెక్ట ర్ విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చె ల్లించాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ లేదా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాల ని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆస్పత్రి సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.