
ఖాళీగా విజయనగరం ఎయిడెడ్ పాఠశాల
కౌటాల మండలం విజయనగరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల పడెకరాల స్థలంలో ఉంది. రెండేళ్లుగా విద్యార్థులు లేక ఖాళీగా ఉంటుంది. సిర్పూర్(టి) గురుకులంలో కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాలకు చెందిన విద్యార్థులే 350 మందికి పైగా ఉన్నారు. విజయనగరం పాఠశాలలో తాత్కలికంగా సర్దుబాటు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అయితే విజయనగరం ఎయిడెడ్ పాఠశాల మారుమూల ప్రాంతంలో ఉందని ఉపాధ్యాయులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉన్నాతాధికారులు కాగజ్‌నగర్‌లోని భవనాలతోపాటు విజయనగరం ఎయిడెడ్ పాఠశాల భవనాలను పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.