
మాదక ద్రవ్యాలు అరికట్టడంలో భాగస్వాములవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యత కాదని, సామాజిక కర్తవ్యంగా భావించాలని సూచించారు. మా దక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్, కార్యాలయ సిబ్బంది మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.