
ఈఎస్‌ఐ, పీఎఫ్ వివరాలు వెల్లడించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన ఈఎస్‌ఐ, పీఎఫ్ పూర్తి వివరాలు వెల్లడించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బుధవారం రెండోరోజు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా పీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలు తెలియజేయడం లేదన్నారు. కార్మికులకు ప్రతినెలా 5లోగా వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లేశ్, కార్మికులు మురళి, నవీన్, మమత, గంగన్న, సౌజన్య, రూప, విమల, నిరోష తదితరులు పాల్గొన్నారు.