
‘ఎస్పీఎంలో స్థానిక కార్మికులపై చిన్నచూపు’
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న స్థానిక కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు చూస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం ఎస్పీఎం హెచ్‌ఆర్, జీఎం గిరిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఎస్పీఎం యాజమాన్యం స్థానికులపై చిన్నచూపు చూస్తూ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వేతనాలు పెంచుతుందని ఆరోపించారు. కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తుందని అన్నారు. ప్రతీ కార్మికుడికి నెలకు రూ.26,500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కల్లూరి శ్రీనివాస్, యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు గోగర్ల రాములు, ఉపాధ్యక్షుడు గోగర్ల శ్యామ్‌రావు, చిట్టవేణి రాజేశ్, కోశాధికారి బండి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి జాడి అశోక్ పాల్గొన్నారు.