● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగులు, ఒర్రెలు ● ఇళ్లలోకి చేరిన వరద నీరు.. స్తంభించిన జనజీవనం ● నీట మునిగిన పంట పొలాలు ● అడ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగులు, ఒర్రెలు ● ఇళ్లలోకి చేరిన వరద నీరు.. స్తంభించిన జనజీవనం ● నీట మునిగిన పంట పొలాలు ● అడ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Aug 14 2025 7:21 AM | Updated on Aug 14 2025 7:21 AM

● జిల

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

చింతలమానెపల్లి మండలం రణవెల్లి వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు

ఆసిఫాబాద్‌రూరల్‌/కెరమెరి/చింతలమానెపల్లి/ దహెగాం/పెంచికల్‌పేట్‌/రెబ్బెన/కౌటాల: జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు వర్షం దంచికొట్టింది. కుండపోత వానకు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత, వార్దా, పెన్‌గంగ, పెద్దవాగు వరదతో ఉప్పొంగాయి. భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసిఫాబాద్‌ మండలంలోని తుంపెల్లి వాగును ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ సహయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాలకు కంటోల్‌ రూం 8500844365 లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి, తుంపెల్లి, అప్పపల్లి వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండలం తలోడి పంచాయతీ కార్యాలయం ఎదుట భారీగా వరదనీరు చేరింది.

రెబ్బెనలో రికార్డు స్థాయిలో..

జిల్లాలో 101.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెబ్బెన మండలంలో రికార్డు స్థాయిలో 219.8 మి.మీ.లు, అత్యల్పంగా బెజ్జూర్‌లో 58.4 మి.మీల వర్షం కురిసింది. తిర్యాణిలో 179.8 మి.మీ, ఆసిఫాబాద్‌లో 115.0 మి.మీ, కాగజ్‌నగర్‌ 133.6 మి.మీ, కౌటాల 112.0 మి.మీ, జైనూర్‌ 71.8 మి.మీ, సిర్పూర్‌(యూ) 61.2 మి. మీ, లింగపూర్‌ 52.6 మి.మీ, కెరమెరి 115.0 మి. మీ, వాంకిడిలో 80.6 మి.మీ, సిర్పూర్‌(టి) 74.7 మి.మీ, చింతలమానెపల్లి 72.2 మి.మీ, పెంచికల్‌పేట్‌ 80.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మండలాల్లో ఇలా..

● కెరమెరి మండలంలో లక్మాపూర్‌, అనార్‌పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సుమా రు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. సాయంత్రం వరకు వర్షం తగ్గినా వాగుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. సాంగ్వి, రాంపూర్‌, ఇంద్రానగర్‌, కెలి కె సమీపంలోని కల్వర్టుపై నుంచి నీరు ప్రవహించడంతో అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకుండా పోయింది. పంచాయతీ కార్యదర్శులు, పోలీసులు వాగులు,కల్వర్టుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

● చింతలమానెపల్లి మండలంలోని శివపెల్లి, రణ వెల్లి, దిందా గ్రామాలకు వెళ్లే రహదారులపై వా గులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దిందా గ్రా మానికి రాకపోకలు పూర్తిగా, రణవెల్లి గ్రామానికి తాత్కాలికంగా నిలిచిపోయాయి. తహసీల్దార్‌ మడావి దౌలత్‌ దిందా వాగు వద్దకు చేరుకుని ప రిస్థితిని పర్యవేక్షించారు. వాగు దాటకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రజలు వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు.

● దహెగాం మండల కేంద్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు, ఎర్రవాగులకు వరద పోటెత్తింది. దిగువ ప్రాంతాల్లో ఉన్న వరి, పత్తి పంటలు నీట ము నిగాయి. ఐనం వద్ద ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పీపీరావు ప్రాజెక్టులోకి వరద చేరడంతో అలుగు దూకింది. ఎర్రవాగు పరీవాహక ప్రాంతంతోపా టు పెద్దవాగు పరీవాహక ప్రాంతాలైన బీబ్రా, ఐనం, పెసరకుంట, దహెగాం, ఒడ్డుగూడ, దిగిడ, లగ్గామాలో పంటలు దెబ్బతిన్నాయి.

● పెంచికల్‌పేట్‌ మండలంలో పెద్దవాగు వరదతో బొంబాయిగూడ, ఎల్కపల్లి, పెంచికల్‌పేట్‌, ఎల్లూర్‌, అగర్‌గూడ, గుండెపల్లి, కమ్మర్‌గాం, నందిగాం గ్రామాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ఉచ్చమల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎర్రగుట్టకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లవాడ వెళ్లే రహదారిలోని ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తోంది. పెంచికల్‌పేట్‌– బెజ్జూర్‌ మధ్య ఒర్రెలు పొంగడంతో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. బొక్కివాగు, పెద్దవాగు, ఉచ్చమల్లవాగు వరదలతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

అడ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతం నుంచి వరద చేరుతుండటంతో బుధవారం కుమురంభీం(అడ ) ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 21,254 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.778 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం 237.65 మీటర్లుగా ఉంది. ఇన్‌ప్లో 8,333 క్యూసెక్కులు ఉండటంతో ఐదు గేట్లను 2 మీటర్లు పైకెత్తి 21,254 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. గుండి వాగులో ప్రవాహం పెరిగింది. దిగువన ఉన్న గుండి, రాజుర, రహపల్లి, చోర్‌పల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు1
1/6

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు2
2/6

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు3
3/6

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు4
4/6

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు5
5/6

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు6
6/6

● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement