
‘ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి’
ఆసిఫాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా జిల్లా కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కన్వీనర్ కోట్నాక విజయ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధించిన విజయాలు, సైనిక సామర్థ్యాలను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రభుత్వం ఉగ్రదాడులను తిప్పికొట్టిందని గుర్తు చేశారు. ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసి జాతీయతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బానోత్ వెంకట్ నాయక్, ఎలగతి సుచిత్, అరిగెల మల్లికార్జున్, వీరభద్రాచారి, అరుణ్‌లోయ, బండి రాజేందర్ పాల్గొన్నారు.