
స్వయం సహాయక సంఘాలతో ఆర్థిక ఎదుగుదల
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: స్వయం సహాయక సంఘాల ఏ ర్పాటుతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని, ప్రతీ మహిళను సంఘాల్లో చేర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు వీఏవోలు, ఏపీవోలు, కమ్యూనిటీ సమన్వయకర్తలకు శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకం కింద వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతీ మహిళ సంఘంలో ఉండేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ యాదగిరి, శేషారావు, యశోద, నరేందర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, సీసీలు పాల్గొన్నారు.